శోధింపుము

font help
best viewed in IE and firefox
Page 1 Of 1 1

పల్లె వి.
రూపాంతర పదాలువ్యుత్పత్తిమూల పదములుశాస్త్ర విభాగము
  1. పల్లియ
పరభాషా సారూప్యత గల పదములు
  1. సంస్కృతము పల్లీ
  2. కన్నడ హళ్ళి
  3. తమిళము పళ్ళి
  1. (దీనికి పల్లి అని రూపాంతరము ఒక శాసనమందుఁ గన్పట్టుచున్నది)
  2. గ్రామము; చిన్నయూరు; కుగ్రామము
    1. గీ. పల్లె కొట్టిక కోటిక కుప్పమ్మ నాఁగ నూగనఁగ గ్రామనామంబు లొప్పుచుండు. ఆం.సం.స్థా.4.
    2. శా. లంచంబిత్తురు దూతికాతతికి లీలన్ బెండపూఁడన్ననిన్, బంచాస్త్రోపముఁ దారతారకవయన్ ప్రార్థించి లోలోపలన్, బంచారామాములందుఁ బల్లెలఁ బురిం బ్రౌఢేందుబింబాననల్. భీమ.1.77.
    3. వ.....చుట్టుపట్ల పల్లెపట్టులఁ గల ప్రజలు దాక వదులు..... ఉ.రా.8.268.
  3. గొల్లలు మొ. వారు నివసించుచోట
    1. శా.....గోబ్బందముల్, మాంగల్యాకృతిఁ నెంతయును సామ్యగ్ర్యంబునం బండు లు,ప్పొంగం బల్లె సముజ్జ్వలోత్సవములం బొంగారె నానాఁటికిన్. హరి.పూ.6.26.
    2. మ. ....చెంతం గొండపై పల్లెలన్, గృకవాకుల్ మొరసెన్ గృహోపరిఁ ద్రిభంగిన్ భుగ్నకంఠధ్వనిన్. మనుచ.3.55.
  4. బడి
    1. ఉ.ఒజ్జలు గొట్టినన్ బడఁగ నోరున కింటికిఁ బాఱుతెంచినన్, దజ్జననీవతంసమును దండ్రియు నిర్దయచిత్తులై సుతున్, నజ్జుగమోది పల్లెకుఁ జన న్వెడలించిన వాఁడు నేడ్చినన్, బొజ్జ కలంగ నాఁకొనుచు భోజనముమేమియు లేక దీనుఁడై . సిద్ధి శేష ధర్మము. 3.ఆ.(చి.ని.)
    2. జ: పల్లెకూటము, పల్లెటూరు, పల్లెమాటు
పల్లె 1 వి.
  1. జాతివిశేషము, ధీవరజాతి
    1. ఉదా: పల్లెవాఁడు , పల్లెది (శ.ర.)
    2. జ:పల్లెత

మీరు చదువుతున్న పదములను యూనికోడ్ లోకి మార్చిన వారు